logo

నల్లరాయి భారీ వాహనాలతో బుచ్చింపేట తారు రోడ్డు ధ్వంసం...

రోడ్డుమీద ప్రయాణం చేయాలంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకోవాల్సిందే బుచ్చింపేట వద్ద గొయ్యిల్లో సిపిఎం ధర్నా. అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం చింతపల్లి వెళ్లే రోడ్డు జంక్షన్ నుంచి బుచ్చింపేట మీదుగా వడ్డీప, శరభవరం వరకు విస్తరించిన తారు రోడ్డు నిర్మాణం గడువు పట్టింది. ఈ రోడ్డు మీదుగా కొయ్యూరు, రోలుగుంట మండలాల్లోని 15 గిరిజన గ్రామాల ప్రజలు బుచ్చింపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్) చేరుకుంటారు. అక్కడి నుంచి ఆరోగ్య సమస్యలతో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ రోడ్డే ప్రధాన మార్గం. అలాగే, అనేక మంది విద్యార్థులు, ప్రయాణికులు నర్సీపట్నం చేరుకోవడానికి ఇదే రోడ్డుపై ఆధారపడతారు.కానీ, ఈ ప్రాంతంలో నల్లరాయి భారీ వాహనాలు 60 టన్నుల పరిమితిని మించి రోజూ ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా, తారు రోడ్డు మట్టి మార్గంగా మారిపోయింది. గొయ్యిలు ఏర్పడి, ప్రయాణం దుర్భరంగా మారింది. రోడ్డుమీద వెళ్లాలంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.గ్రామస్తుల ఆందోళనకు అధికారుల అలక్ష్యం గత సంవత్సరం బుచ్చింపేట గ్రామస్తులు భారీ నల్లరాయి క్వారీ వాహనాలు తిరగకుండా ఉండాలని, భారీ వాహనాల నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే, క్వారీ ల్లో బాంబ్ బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాయని రాజన్నపేట, నల్లరాయి క్వారీల వద్ద గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, మైనింగ్ డిపార్ట్‌మెంట్, ఆర్‌టీవోలు తదితరులంతా మైనింగ్ మాఫియా చేతుల్లో ఉన్నారని ఆరోపణలు గుసగుసలాడుతున్నాయి. ఫలితంగా, నల్లరాయి క్వారీ భారీ వాహనాలకు ఎటువంటి అడ్డుకట్ట లేదు.తక్షణ చర్యలు చేపట్టాలి.. జిల్లా ఖనిజ నిధులను పట్నాల్లో ఖర్చు చేస్తున్నారు. కానీ, బుచ్చింపేట గ్రామస్తుల అవసరాలకు తక్షణమే ఖర్చు పెట్టాలని డిమాండ్. బుచ్చింపేట రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు.ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, చిరంజీవి పాంగి, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

5
8 views