జర్నలిస్టుల ఐక్యతే మన ఆయుధం!
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ఒక్కరో పోరాడితే సమస్యలు పరిష్కారం కావు; అందరూ కలిస్తేనే వ్యవస్థపై ఒత్తిడి తీసుకురాగలము. అన్ని జర్నలిస్ట్ యూనియన్లు తమ విభేదాలను పక్కన పెట్టి, జర్నలిస్టుల హక్కుల కోసం ఒకే వేదికపైకి రావాలి. మీరు ఏ యూనియన్‌లో ఉన్నా సరే, సమస్య అని వస్తే మీ తరపున పోరాడడానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో కష్టపడే రిపోర్టర్లకు సరైన గుర్తింపు, రక్షణ మరియు గౌరవం దక్కేలా చేయడమే మన ప్రధాన లక్ష్యం."జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ఆ స్తంభాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుదాం.. జర్నలిస్టులకు న్యాయం చేద్దాం! సురేంద్ర బాబు వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షుడు, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (N.A.R.A)