logo

రాజంపేట నియోజకవర్గం రూరల్ మండలం లోని ఆకేపాటి ఎస్టేట్ నందు

*రాజంపేట*

*రాజంపేట నియోజకవర్గం రూరల్ మండలం లోని ఆకేపాటి ఎస్టేట్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు & రాజంపేట నియోజకవర్గం శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న జీవోలను కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు SEC మెంబర్ మాసిమా బాబు గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కడప నగర ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య గారు, నాయకులు వాసు గారు , ఫయాజ్ గారు భోగి మంటల్లో వేసి దహనం చేశారు...*

*ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని మేయర్ గారు , SEC మెంబర్ గారు,డిప్యూటీ మేయర్ గారు గజమాలతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు...*

*మేయర్ గారు మీడియా తో మాట్లాడుతూ..*

*మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులు గమనించి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మూడు కాలేజీ లలో అడ్మిషన్స్ కూడా ఇచ్చారు..*

*కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలను నిర్మాణాలు పూర్తి చేసి అడ్మిషన్స్ ఇవ్వకుండా కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు..*

*ఈ చర్యను ఖండిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం , రచ్చబండ , నిరసన , ర్యాలీల కార్యక్రమాలు చేపట్టాము..*

*ఈ కూటమి ప్రభుత్వం వారి బినామీలకు కాలేజీలను కట్ట పెట్టాలని జీవోలను తీసుకువచ్చారు. దానిని ఖండిస్తూ కూటమి నాయకుల బుద్ధి మారి జీవోలను రద్దు చేయాలని భోగిమంటల్లో జీవోలను తగలపెట్టామని తెలియజేశారు..*

*వైఎస్ఆర్సీపీ రాజంపేట సీనియర్ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు...*

15
1224 views