logo

పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి - మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి
ముఖ్య కార్యకర్తల సమావేశంలో జూలకంటి

vbstv telugunews మిర్యాలగూడ

అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో మిర్యాలగూడ నియోజవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వృధాగా ఉన్నాయని వాటిని లబ్ధిదారులను పంపిణీ చేయాలని ఆయన కోరారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండస్థలాలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిందని రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు దాని ప్రస్తావన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల దృశ్య దరఖాస్తులను స్వీకరిస్తున్నారని చెప్పారు. స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ళ స్థలాలు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పంపిణీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఓడించేలా ప్రజలలో చైతన్యవంతులను చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. 2026 పార్టీ సభ్యత్వం సభ్యులు ఈనెల 20 లోపు చెల్లించాలని కోరారు. ఈనెల 19న నల్గొండలో తెలంగాణ రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే నిరసన ప్రదర్శన సభకు, ఈ నెల 25న హైదరాబాదులో ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభకు మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శలు రవి నాయక్, పాతూరి శశిధర్ రెడ్డి, పట్టణ కార్యదర్శులు డ డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, రెముడాల పరశురాములు, గోవర్ధన, ఊర్మిళ, కోడిరెక్క మల్లయ్య తదితరలు పాల్గొన్నారు.

2
0 views