15 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
🔴 బ్రేకింగ్ న్యూస్
15 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చింతగుంటూరు గ్రామానికి చెందిన మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసిన కేసులో
నిందితుడు దిలీప్ కుమార్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది
చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు.
2022లో బాలికను అపహరించి, నకిలీ వివాహం పేరుతో కర్ణాటక బళ్లారి జిల్లాలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.
ఈ కేసులో బాలిక గర్భవతి అయినట్టు కూడా విచారణలో వెల్లడైంది.
సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకున్న
పోక్సో కోర్టు జడ్జి శ్రీ ఎం. శంకర్ రావు గారు
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.
కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన
దిశా డీఎస్పీ జే. బాబు ప్రసాద్, గుడిపాల పోలీసుల పనితీరును
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ప్రత్యేకంగా అభినందించారు.