logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఏజెంట్ చేతిలో మోసపోయిన మరో గల్ఫ్ వ్యక్తి. (31 జనవరి 2026) ఏజెంట్ల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది.





నిర్మల్ జిల్లా: లక్ష్మణచంద మండలం స్థానిక గ్రామానికి చెందిన సంగెపు రాజు (37) గత ఐదు నెలల క్రితం దుబాయ్ వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయానని గ్రహించిన అతను చెప్పిన పని ఇక్కడ లేకపోవడంతో గ్యాస్ కంపెనీ పనిచేస్తూ అనారోగ్యానికి గురై మానసిక స్థితి సరిగా పనిచేయకపోవడంతో క్యాంపు లో నుంచి బయటకు వెళ్లి తప్పి పోయాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే అందుబాటులో లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. నిర్మల్ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ని ఆశ్రయించారు.. కంపెనీలో ఉండి తప్పిపోవడం వలన కుటుంబ సభ్యులకు దుబాయిలో భారత సేవా సమితి సభ్యులను సంప్రదించారు. రాజుని వెతకమని సహాయం కోరారు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. భారత సేవా సమితి సభ్యుడు బొమ్మ ప్రవీణ్ అజమాన్ లేబర్ లేబర్ క్యాంపులు వెతికి రాజు ఆచూకీ తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బొమ్మ ప్రవీణ్ కంపెనీకి తీసుకు వెళ్లి అప్పజెప్పి అతన్ని ఆరోగ్య పరిస్థితి వివరించి అతనిని వీలైనంత తొందరగా ఇండియా పంపించాలని ఇంటికి పంపించాలని వివరించారు కంపెనీ వారు స్పందించి త్వరలోనే ఇంటికి పంపిస్తామని తెలియజేశారు, భారత సేవ సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు జంగం బాల కిషన్, బొమ్మ ప్రవీణ్ తదితరులు భారత సేవ సమితి సభ్యులకు ధన్యవాదాలు. ఏజెంట్ల మెసల పట్ల గల్ఫ్ వచ్చె కార్మికులు చాల జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవసరమం ఉందని పేర్కొన్నారు.

14
251 views

Comment