logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన అపచారాలకు వైసిపి పాప ప్రక్షాళన పూజలు

⭐ *తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన అపచారాలకు వైసిపి పాప ప్రక్షాళన పూజలు.* ⭐ *సాలూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాపప్రక్షాళన పూజలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు వైసీపీ నేతలు.* ⭐*కూటమి నేత‌ల‌కు వెంకటేశ్వరస్వామి స‌ద్భుద్ధి ప్ర‌సాదించాల‌ని వేడుకున్న‌ మాజీ డిప్యూటీ సీఎంరాజన్నదొర గారు.* ⭐*పవిత్రమైన లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన సీఎం,డిప్యూటీ సీఎం,కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు,నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.* కళియుగ శ్రీవెంకటేశ్వర స్వామి తిరుమల ల‌డ్డూ కోసం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని ఇటీవ‌ల సీబీఐ నివేదిక వెల్ల‌డించింది.ఈ మేర‌కు *మాజీ సీఎం,వైసీపీ అధినేత శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు వైసీపీ నేత‌లు రాష్ట్రవ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌రస్వామి ఆల‌యంలో పాపప్రక్షాళన పూజలు చేశారు.ఈ సందర్బంగా ఈరోజు *సాలూరు* పట్టణంలోనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు &రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు వైసీపీ శ్రేణులతో కలిసి *పాపప్రక్షాళన పూజలు* చేశారు.ఆలయానికి విచ్చేసిన *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారికి అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు.తదనంతరం *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు మాట్లాడుతూ తిరుపతి కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్రమైన లడ్డూను కూటమి ప్రభుత్వం అపవిత్రం చేసిందని,తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా,స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపేలా, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని తక్కువ చేసేలా,టీటీడీ పేరు ప్రఖ్యాతులను చెడగొట్టేలా సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు కూటమి నేతలు అసత్య ప్రచారం చేసారన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆరోపించారు.తిరుమల లడ్డూ పై దుష్ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నేతలు పాపపరిహార పూజలు చేయాలని,ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన కూటమి నేతలకు భగవంతుడే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.*రాజ్యాంగబద్దమైన పదవులలో ఉన్నవారు,అధికారంలో ఉన్న వారు ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలని* తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ వివిధ మండలాల వైసీపీ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు,భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

23
1360 views

Comment