logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సిక్కోలు ముద్దు బిడ్డకి ఆంధ్ర రాష్ట్ర బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అవకాశం

భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి బోరుబద్ర చంద్రకళ ( శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామము) ఎంపిక
పార్టీపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం – నాయకత్వ వర్గాలు

శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి:
భారత చైతన్య యువజన పార్టీ (BCY) రాష్ట్ర కార్యవర్గానికి శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీమతి బోరుబద్ర చంద్రకళ ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సమాజ సేవలో ఆమె చూపిన నిబద్ధత, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, యువతను సంఘటితం చేయడంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నియామకం పార్టీ ఆమెపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు BCY నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యలపై పోరాటంలో ఆమె పాత్ర మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోరుబద్ర చంద్రకళ నాయకత్వంలో పార్టీ ఆశయాలు ప్రజల్లోకి మరింత బలంగా చేరతాయని తెలిపారు.
ఈ నియామకం పట్ల జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

11
624 views

Comment