logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇదే కదా ఎమ్మెల్యే గారు! నియోజక వర్గంలో ప్రజలు మీ నుండి కోరుకునేది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజక వర్గంలో సుమారు 22 కోట్ల రూపాయలు కొత్త రోడ్లు నిర్మించడం కోసం గత ఏడాది ఖర్చు చేశారు.

మరలా ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త రోడ్లు పనులు ప్రారంభించారు. దానికి ఎన్ని కోట్లు విడుదల చేశారో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారు చెబితే బాగుంటుంది.
ఏదైతేనేం,
మొన్న వంకవారిగూడెంలో (జీలుగుమిల్లి మండలం)
మరుసటి రోజు పందిరి మామిడి గూడెం. (బుట్టాయగూడెం మండలం)
తర్వాత రోజు మక్కినవారిగూడెం.
(టి. నర్సాపురం మండలం)

ఆ పనులు కూడా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి చేతులు మీదుగా కొబ్బరి కాయలు కొట్టిన కాసేపటికే అక్కడ ఉన్న జేసిబి లు కొత్త రోడ్లు పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు.

ఈ పనులు మీడియా/స్థానిక ప్రజల మధ్య ఒక వేడుక వాతావరణం గా జరిగింది.

ఇదే కదా నియోజక వర్గంలో కూటమి నుండి ఎన్నికైన ఎమ్మెల్యే గారినుండి సామాన్య ప్రజలు కోరుకునేది.


అయితే,
నేను ఈ సందర్భంగా ఒక విషయం గురించి మీతో పంచు కోవాలనుకుంటున్నా
ను.

ఇప్పుడే గంగినీడు పాలెం గ్రామంలో భూములు గురించి మీటింగ్ పెట్టి ముగించుకొని తిరిగి వస్తుంటే రాత్రి పూట కూడా లైట్ల వెలుతురులో నాలుగు జే సి బీ లు రోడ్డు పనులు చేస్తూ కనిపించాయి.
అందుకే ఈ వార్త రాస్తున్నాను.

ఏళ్ల తరబడి రోడ్డు కోసం ప్రజల ఎదురు చూపులు!

అవునూ,
నిజమే కదా! ఎన్నో ప్రభుత్వాలు మారాయి!
ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారూ పోయారు.
ఈ ప్రాంత ప్రజలు గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే కు రోడ్డు కోసం మొర పెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో ఇక మనకు రోడ్లు వేయరని ప్రజా ప్రతినిధుల ను తిట్టు కోవడం మొదలు పెట్టారు.
కానీ ఆశ్చర్య పోయే రీతిలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు రోడ్లు పనులు ప్రారంభించారు.

ఈ రోడ్డు నిర్మాణం వల్ల రెండు నియోజక వర్గాల కు మంచి జరుగుతుంది.
ఇప్పటి వరకూ జీలుగుమిల్లి నుండి మక్కిన వారిగూడెం గోతులు లో ప్రయాణం చేయలేక మందలపల్లి మీదుగా చుట్టుతిరిగి ఏలూరు, విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది.
ఇప్పుడు
చింతల పూడినుండి కొత్త రోడ్లు నిర్మించడం వలన మక్కిన వారిగూడెం మీదుగా ఏలూరు, విజయవాడ వెళ్ళటానికి దూర భారం తగ్గి సులువు అవుతుంది.

అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే కి 20 నిమిషాలు పడుతుంది.
అంతే కాకుండా,చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో హైవే పై కి ఎక్కి అటు హైదరాబాద్ ఇటు వైజాగ్ నాలుగు గంటల సమయంలో వెళ్లవచ్చు.
పోలవరం నియోజక వర్గం ఏజెన్సీ ప్రాంతం . ఈ ప్రాంత ప్రజలు, ఆదివాసీలు మెరుగైన వైద్య సేవలు కోసం, కలెక్టర్ గారి నీ కలవడం కోసం నిరంతరం ఏలూరు విజయవాడ వెళుతుంటారు.
అందుకోసం ఇప్పటి వరకూ అనేక ఇబ్బందులు పడ్డారు.
ఇప్పుడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి కృషి వలన ఈ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలు పోయే సమయం వచ్చింది.
ఎమ్మెల్యే గారు మీరు చేసిన ఈ పనిని జీలుగుమిల్లి, టి. నర్సాపురం, చింతలపూడి, అశ్వారావుపేట, లింగపాలెం మండలాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని నమ్ముతున్నాను.

మీరు ఇదే విధమైన పనితీరు తో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాను.

ఇట్లు
సోమరాజు నడపాల
సెల్ nem: 7095696108

3
138 views

Comment