మేము ఖర్చుపెట్టిన నిధులు మాకు ఇవ్వండి బాబోయ్ అంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని అధికారులు..
మేము ఖర్చుపెట్టిన నిధులు మాకు ఇవ్వండి బాబోయ్ అంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని అధికారులు..
నేడు వైసీపీ సర్పంచులను టార్గెట్ చేస్తూ, వాళ్లు ఖర్చుపెట్టిన నిధులను అమలు చేయకుండా అధికారులకు హుకుం జార్చేసిన మంత్రి సవిత తీరుపై తీవ్రంగా ఖండిస్తూ... మా నిధులు మాకు ఇవ్వండి బాబోయ్ అంటూ పెనుకొండ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట సర్పంచులకు మద్దతుగా నిరసన చేపట్టిన మాజీమంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్
ఈ నిరసన భాగంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ..
ఎన్నడూ లేని విధంగా, సర్పంచుల నిధులను ఆపేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేసిన మంత్రి సవిత తీరుపై తీవ్రంగా మండిపడ్డారు..
పంచాయితీల మౌలిక వసతుల కోసం అప్పులు చేసి, వడ్డీలకు తెచ్చి ఖర్చు చేసిన సొమ్మును, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న స్పందించకపోవడంతో చాలా బాధాకరమన్నారు..
అధికారుల సైతం మంత్రికి వత్తాసు పలుకుతున్నారని, నిధులు మంజూరు చేయకుండా పెండింగ్లో ఉంచిన అధికారులపై త్వరలో ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు..
గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో నిధులు మంజూరు చేయకుండా మంత్రి సవిత అడ్డుకోవడం దుర్మార్గమని మాజీమంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు..