logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రహదారి భద్రత, నేర నియంత్రణకు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు *-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్.*


విజయనగరం పట్టణంలో ఫిబ్రవరి 11న ముందుగా గుర్తించిన 140 ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. డిఎస్పీల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేకంగా చేపట్టగా, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించారు. రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహన పత్రాలు సక్రంగా లేని వాహనాలను సీజ్ చేయడం, హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేసామన్నారు.
తనిఖీల ముఖ్యాంశాలు:
* పోలీస్ బలగం: ఈ తనిఖీల్లో సుమారు 1000 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
* సీజ్ చేసినవి: రికార్డులు సక్రమంగా లేని వాహనాలు, సైలన్సర్లను మార్పులు చేసి శబ్ద కాలుష్యం కలిగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామన్నారు.
* చర్యలు: మైనరు డ్రైవింగు, హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
* ముఖ్య నినాదం: త్వరలో జిల్లా వ్యాప్తంగా “నో హెల్మెట్ - నో పెట్రోల్” అనే నినాదాన్ని అమలు చేస్తామన్నారు.
"తల్లి జన్మనిస్తే.. హెల్మెట్ పునర్జన్మనిస్తుంది." - ఎ.ఆర్.దామోదర్, జిల్లా ఎస్పీ
ఇతర కీలక అంశాలు:
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి, ప్రభుత్వం రూ. 5వేలు నగదు ప్రోత్సాహకంగా అందిస్తుందని, వారిపై ఎటువంటి పోలీస్ వేధింపులు ఉండవని ఎస్పీ స్పష్టం చేసారు.
పట్టణంలోని కోట జంక్షను, మూడు లాంతర్లు, గంట స్థంభం వద్ద తనిఖీలను ఎస్పీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, జి. భవ్య రెడ్డి, ఎస్.రాఘవులు, వీరకుమార్, పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

23
15 views

Comment