శిక్షణలోనే భవిష్యత్తుకు పునాది: ట్రైనీ కానిస్టేబుళ్లతో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖాముఖి
విజయనగరం పట్టణం సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఫిబ్రవరి 11న సందర్శించి, జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్ళుతో మమేకమై, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించడంతోపాటు, శిక్షణ కేంద్రంలోని మౌళిక వసతులు, వసతి, మెస్ గురించి శిక్షణార్ధులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీసింగ్ మారుతూ వస్తుందన్నారు. బేసిక్ పోలిసింగుతో పాటు కొత్తగా వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్తితులలోనైనా ఉద్యోగం చేసేవాడే పోలీస్ అని తెలిపారు. పోలీసు ఉద్యోగులు క్రమశిక్షణతో కూడిన శారీరక శిక్షణ పొందడం వలనే ఇది సాధ్యమవుతుందని, కావున, శిక్షణలో ప్రతీ ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. శిక్షణలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ శిక్షణ పూర్తయిన తరువాత ప్రతీ ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అందరితో కలిసి భిన్న వాతావరణం, విభిన్నమైన ప్రాంతాల్లో శిక్షణ పొందడం వలన ఎవరితో ఏవిధంగా మెలగాలో తెలియడంతోపాటు, ప్రతీ ఒక్కరు శారీరక, మానసికంగా మెరుగవుతారన్నారు. సమాజంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులనే ఆశ్రయిస్తున్నారంటే ప్రజలు పోలీసు యూనిఫాంకు ఇస్తున్న విలువను అర్ధం చేసుకోవాలన్నారు. శిక్షణ నుండే ప్రతీ ఒక్కరూ ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ, భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జీవితంలో చెడు వ్యసనాలకు, డ్రగ్స్ కు ఆకర్షితులు కావద్దని, సాంకేతికతను అందిపుచ్చుకొని, మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు. సాంకేతికతకు మనం బానిసలు కాకూడదని, సాంకేతికతను వినియోగించుకొని మనం అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్నారు. పోలీసు విధులను స్మార్ట్ గా నిర్వహించాలని, శిక్షణను ఇష్టంతో పూర్తి చేయాలని శిక్షణార్థులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.
అనంతరం, శిక్షణార్థుల వసతి గదులను, తరగతి గదులను పరిశీలించారు. శిక్షణలో ఇన్ డోర్, ఔట్ డోర్ తరగతుల నిర్వహణ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని వారికి కొన్ని సూచనలు చేసారు. శిక్షణార్ధులతో కలసి జిల్లా ఎస్పీ భోజనం చేసారు. శిక్షణార్ధులకు అందించే మెస్ మెనూలో కొన్ని మార్పులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిపిటిసి డిఎస్పీ పి.నారాయణరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, డిపిటిసి సిఐలు, ఆర్ఐ టి. శ్రీనివాసరావు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, శిక్షణ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
మీ కోసం కొన్ని పవర్‌ఫుల్ హెడ్డింగ్స్:
* శిక్షణలోనే భవిష్యత్తుకు పునాది: ట్రైనీ కానిస్టేబుళ్లతో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖాముఖి
* సాంకేతికతకు బానిసలు కావద్దు.. వినియోగదారులుగా ఎదగాలి: జిల్లా ఎస్పీ పిలుపు
* క్రమశిక్షణే పోలీసులకు ఆభరణం.. శిక్షణార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్పీ ఎ.ఆర్.దామోదర్