logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ను జిల్లా ఎస్పీ సందర్శించారు. మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా

వి.వి.ఐ.పీల రాకతో పాటు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, క్యూలైన్ నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రత్యేక భద్రతా బందోబస్తు ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు, ఎలాంటి అపరిస్థితులు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
15,16 ,17, 18 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు సంబంధించి భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం......
14వ తేదీ సాయంత్రం నుంచి భద్రత ఏర్పాట్లు, 15వ తేదీ నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తాం.......
రథోత్సవం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ఏర్పాట్లు చేపడుతాం....
ఓపెన్ డ్రింకింగ్, ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం, సీసీ కెమెరాలు, డ్రోన్, నైట్ విజన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచుతాం......
15 వ తేదీ సాయంత్రం నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.....
స్థానిక పోలీసులతో పాటు వందమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు పకడ్బందీగా చేపడతాం......
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు...
శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని భద్రత ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ గారు, హిందూపురం డిఎస్పీ కేవీ మహేష్ తో కలిసి స్థానిక పోలీస్ అధికారులతో ఆరా తీశారు. దేవాలయంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
ఈనెల 14 సాయంత్రం నుంచి 18వ తేదీ వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతామని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. స్థానిక పోలీసులతో పాటు 100 మంది బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. 14వ తేదీ సాయంత్రం నుంచి భద్రత ఏర్పాట్లు, 15వ తేదీ నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు.రథోత్సవం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్, ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, సీసీ కెమెరాలు, డ్రోన్, నైట్ విజన్ డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామన్నారు .15 వ తేదీ సాయంత్రం నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివ క్షేత్రాలలో శివరాత్రి పండుగ సందర్భంగా పోలీస్ శాఖ పరంగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ గారి వెంట హిందూపురం డిఎస్పీ కేవీ మహేష్, హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ రామానంద, ఎస్ఐ నరేంద్ర సిబ్బంది ఉన్నారు.
పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం..

36
726 views

Comment