TG CM A REVANTH REDDY WITH SMT.PRIYANKA GANDHI
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రియాంక గాంధీ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలిపారు.