logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నేడు మహాశివరాత్రి..

శ్రీకాకుళం:మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీముఖలింగేశ్వరాలయాన్ని ముస్తాబు చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశా రు. ప్రత్యేక దర్శనానికి, ఉచిత దర్శనానికి వేర్వేరు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గతంలో ప్రత్యేక దర్శనానికి ఆలయం దక్షిణ వైపు నుంచి... ఉచిత దర్శనానికి ఉత్తర దిశ నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం క్యూలైన్లు దక్షిణ వైపు నుంచి ఏర్పాటు చేసి బోర్డులు అమర్చారు. భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు, తివాచీలు ఏర్పాటు చేశా రు. ఆలయ సముదాయాన్ని పూలతో అలంకరించారు. అర్థ రాత్రి నుంచే స్వామిదర్శనం కల్పిస్తున్నట్లు ఈవో ఏడుకొండలు తెలిపారు. నాలుగు రోజులపాటు వైద్యసేవలందించను న్నట్టు డిప్యూడీ డీఎంహెచ్‌వో తాడేల శ్రీకాంత్‌ తెలిపారు.

600 మంది పోలీసులతో బందోబస్తు

మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జలుమూరు ఎస్‌.ఐ. బి.అశోక్‌బాబు తెలిపారు. 73 సీసీ కెమోరాలతో నిఘా ఉంచామన్నారు. 10 డ్రోన్‌ కెమె రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 24 రోప్‌ పార్టీలను నియమించినట్టు వివరించారు. ప్రత్యేక దర్శనానికి రూ.20 టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయం వెనుక భాగంలో మూడు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

4
709 views

Comment