logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు హిందూపురం, 16-02-2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లేపాక్షిలోని

శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తుల నడుమ శివపార్వతుల కల్యాణోత్సవం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి.
అనంతరం శివపార్వతుల బ్రహ్మరథోత్సవం భక్తుల హర్షధ్వానాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. రథం చుట్టూ “హర హర మహాదేవ” నినాదాలు మార్మోగగా, వేలాదిమంది భక్తులు పాల్గొని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
జిల్లా అధికారులు, ఆలయ ఈఓ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, ప్రసాదం, క్యూలైన్లలో సౌకర్యాలు సమకూర్చారు.
ఈ సందర్భంగా లేపాక్షి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఈ బ్రహ్మరథోత్సవం భక్తుల మనసులను హత్తుకుందi
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో ఉన్న ప్రసిద్ధ నాగపడగ శివలింగం వద్ద ఆదివారం ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించగా, కలెక్టర్ భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రార్థనలు సమర్పించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి, మహాశివరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిపూర్వకంగా జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఆదివారం రాత్రి జరిగిన మహా శివరాత్రి జాగరణ కార్యక్రమాలు అంత్యంత అద్భుతంగా జరిగాయి.ఎమ్మేల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు డా . సురేంద్ర, బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. లేపాక్షిలో వెలసిన శ్రీ దుర్గా పాపనేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణం,బ్రహ్మ రథోత్సవమును బ్రహ్మాండంగా కనివిని ఎరుగని రీతిలో వేడుకలు జరిగాయి.ఆలయ చైర్మన్ కరణం రమానందన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా బ్రహ్మరథోత్సవం లక్షలాదిమంది భక్తుల నడుమ ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దేవాలయం ప్రతిరోజు వేలాదిమంది యాత్రికులు సందర్శిస్తూ లేపాక్షి కీర్తి ప్రతిష్టలు దశ దిశల వ్యాపింప చేస్తున్నారు. సోమవారం బ్రహ్మరథోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిమంది కొనసాగడం చాలా సంతోషంగా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ రెండు రోజుల ముందుగా పర్యటించి డీఎస్పీ మహేష్, రూరల్ సీఐ కె.జనార్ధన్ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర ,బాలాజీ , ఈ ఓ నరసింహమూర్తి,ఆలయ ఛైర్మెన్ రామానందన్,తహసీల్దార్ జి .సౌజన్య లక్ష్మీ, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ నరసింహ మూర్తి,ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు మండల ప్రజలు తోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ,కర్ణాటక, తమిళనాడు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.

14
1148 views

Comment