logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మధ్యప్రాచ్యానికి భారీగా తరలుతున్న అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు....

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు.. ఈ వారాంతంలోనే దాడులకు అమెరికా సైన్యం సిద్ధం!ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికా.విఫలమైన జెనీవా చర్చలే ఉద్రిక్తతలకు కారణం.మధ్యప్రాచ్యానికి భారీగా తరలుతున్న అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు.అణు కేంద్రాల వద్ద రక్షణను పటిష్ఠంచేసుకుంటున్న.ఇరాన్.అప్రమత్తమైన ఇజ్రాయెల్.. సైన్యాన్ని హై అలర్ట్‌లో ఉంచిన వైనం

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్తున మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్' ఈ వారాంతంలోగా ఆ ప్రాంతానికి చేరుకోనుంది. దీనికి తోడు యూకే నుంచి యుద్ధ విమానాలు, రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు కూడా ఇరాన్‌కు సమీపంలో మోహరించాయి. ఒకవేళ దాడులు జరిగితే, ఇజ్రాయెల్‌తో కలిసి కొన్ని వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాలపై మంగళవారం జెనీవాలో జరిగిన పరోక్ష చర్చలు సఫలం కాలేదు. అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, ఇరాన్ దానికి అంగీకరించలేదు. "దౌత్యానికే మా మొదటి ప్రాధాన్యం, కానీ అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోం" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. తమ అణు కేంద్రాలను కాపాడుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, పర్చిన్, ఇస్ఫాహాన్ వంటి కీలక కేంద్రాల చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మిస్తోంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం భూగర్భ సొరంగాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం, ఇరాన్‌పై దాడులు జరిగేందుకు 90 శాతం అవకాశం ఉందని అమెరికా భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఇప్పటికే 'హై అలర్ట్'లో ఉంచింది.

8
203 views

Comment