logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సమత సమాజ స్థాపకుడు.. బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్.. బహుజన సేన జన్మదినోత్సవంలో ఇంకా చాలా మంది ముస్లిం క్రైస్తవులు పాల్గొన్నారు

సమత సమాజ స్థాపకుడు..
బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్..
బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు

======================


భారతదేశంలో చారిత్రక నేపథ్యం కలిగిన, వీరోచిత చరిత్ర కలిగిన,
సమత స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజని
నేడు 396వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు తెలియజేశారు.
బహుజన సేన ఆధ్వర్యంలో నేడు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి మదనపల్లి లోని స్థానిక చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో చిత్రపటానికి పూలమాల వేసి కమ్మగడ్డ వీధిలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీగా చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాలతో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవులతో పాటు పెద్ద ఎత్తున మరాఠీ సంఘాలు పాల్గొన్నారు.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పి.టి.ఎం. శివప్రసాద్ గారు మాట్లాడుతూ...
చత్రపతి శివాజీ గారు ఒక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదని ఒక దేశానికి సంబంధించిన నాయకుడని,
చత్రపతి శివాజీ ముస్లిం వర్గానికి వ్యతిరేకులు కాదని తన రాజ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు తన సైన్యంలో 60 శాతం ముస్లింలను, అంగరక్షకులను ఏర్పాటు చేసుకొని వారి పట్ల తన విశ్వాసాన్ని ప్రదర్శించారని. కేవలం రాజ్య విస్తరణలో భాగంగా, స్వరాజ్య పరిపాలనలో భాగంగా హిందూ రాజ్యాల పైన ముస్లిం రాజ్యాల పైన కూడా దండయాత్ర కొనసాగించారని
వీరు తెలియజేశారు.
జనసేన పార్టీ రాయలసీమ నాయకులు రాందాస్ అన్న గారు మాట్లాడుతూ...
యుద్ధ సమయంలో స్త్రీల పట్ల పిల్లల పట్ల ఎవరు ఇబ్బందికరంగా ప్రవర్తించిన వారి పట్ల శిక్షలు వేసేవారని, యుద్ధ సమయంలో ఇతర మత గ్రంథాలు కురాన్ లాంటివి కనపడిన వారి మత పెద్దలకు చేర్చే వారిని అంతటి మతసామరస్యాన్ని పాటించిన ఏకైక చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ అని వీరు కొనియాడారు. మాల మహానాడురాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం గారు మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటిగా చత్రపతి శివాజీ జయంతిని చేశారని, మొట్టమొదటి కవిత గానం చేసి, సత్యశోధకు సమాజ్ ద్వారా మహారాష్ట్రలో పల్లె పల్లెకు తిరిగి చత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని పరిపాలన విధానాన్ని తెలియజేశారని,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 మార్చి 10వ తేదీన చత్రపతి శివాజీ మహారాజ్ సమాజ్ సందర్శించి గొప్ప ప్రతిజ్ఞ పూని, మహత్ చెరువు పోరాటాన్ని కొనసాగించారని
వీరు తెలియజేశారు.
భారత రాజ్యాంగం ద్వారా.. చత్రపతి శివరాజ్ మహారాజ్ కి జరిగిన అవమానాన్ని ఏ భారతీయునికి జరగకూడదని
భారత రాజ్యాంగంలో గొప్ప సంస్కరణలు తెచ్చాడు. విజయవాడకు చెందిన అడ్వకేట్ సాదిక్ షేక్ గారు మాట్లాడుతూ...
చత్రపతి శివాజీ పరిపాలనను
ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆయుధం పట్టి యుద్ధం చేయనిచ్చాడు. మనుధర్మ సిద్ధాంతాలను బద్దలు కొట్టాడు అని వీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరాటి సంఘ నాయకులు అమ్మ భవాని మహిళా మరాఠా సంఘ అధ్యక్షులు వినుతా బాయ్ గారు, సంగీత భాయ్, కే లలిత తో పాటు బాబురావు, ప్రశాంత్ గారు, ఆటో సూరి, ఈశ్వర్ రావులతోపాటు పెద్ద ఎత్తున మరాఠీలు పాల్గొన్నారు.
వాయల్పాడు అహ్మద్, ముస్లిం నాయకులు మహమ్మద్ సలాం, మీమ్ సేన నూరు అలామ్, చైతన్య సర్వీస్ సొసైటీ ఆనంద్ గారు, వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు, బహుజనసేన నాయకులు భాను ప్రకాష్, రాఘవేంద్ర యాదవ్, రెడ్డి శేఖర్,
బాస్ నాయకులు కృష్ణ, శశి, విజయవంతం చేశారు.

41
2332 views

Comment