logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పలించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ ఆలోచన

నేషనల్ హైవే 365 బి రోడ్డును సిరిసిల్ల నుండి కోరుట్ల వరకు పొడిగించాలని డిల్లీలో కేటీఆర్ తో కలిసి నితిన్ గడ్కరీ ను కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ కోరారు

కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ ను కలిసి, నేషనల్ హైవే 365B ను సిరిసిల్ల నుండి కోరుట్ల వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణ, పరిశ్రమల ప్రోత్సాహం దృష్ట్యా ఈ రహదారి విస్తరణ ఎంతో కీలకమని కేటీఆర్ వివరించారు. సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమలకు, కోరుట్ల పరిసర ప్రాంతాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ మార్గం ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
హైవే పొడిగింపుతో స్థానికులకు మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

32
2373 views

Comment