logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో గ్యాంబ్లింగ్‌పై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు.

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో గ్యాంబ్లింగ్‌పై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు.
గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారి పల్లి – ములపల్లి మధ్య ప్రాంతంలో గత కొంతకాలంగా గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
ఈరోజు సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో పోలీసులు దాడి చేయగా అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అక్కడికక్కడే పట్టుకున్నారు. పారిపోతున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా కొందరు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
పోలీసులు వారి వద్ద నుంచి
💰 రూ.26,300 నగదు
📱 5 మొబైల్ ఫోన్లు
🏍️ 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదే సమయంలో చిత్తూరు మరియు తమిళనాడు ప్రాంతాల నుంచి గ్యాంబ్లర్లను పిలిపించి బార్డర్ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని తెలిపారు.
గుడిపాల మండలంలో గ్యాంబ్లింగ్, గంజాయి సరఫరా లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

18
1054 views

Comment