కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కొరుకు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరవదిక దీక్ష.
రుద్రవరం::ఫిబ్రవరి 23, 24 తేదీలలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట 36 గంటల నిరవదిక దీక్షలో కౌలు రైతులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదివారం నాడు రుద్రవరం కేంద్రంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామ చంద్రుడు, రుద్రవరం మండల కార్యదర్శి టి.గురెడ్డి లు విలేకరుల సమావేశంలో తెలిపారు.నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫిబ్రవరి నెల 23, 24 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు కొరకు జరుగుతున్న 36 గంటల నిరసన నిరవధిక దీక్షలో దూరం మండలంలోని కౌలు రైతుల పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామ చంద్రుడు, రుద్రవరం మండల కార్యదర్శి టి.గురెడ్డి లు కోరారు. జిల్లాలో రోజురోజుకు కౌలు రైతుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. సొంత రైతులతో సమానంగా పంటలుపండించే కౌలు రైతులు రోజు రోజుకి అప్పలబారం పెరిగిపోయి, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించి విధానాల వల్ల విపరీతంగా పెరిగిన వ్యవసాయ పెట్టుబడులు, అమలు కానటువంటి మద్దతు ధరలు వీటికి తోడు అరకోరా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు దక్కకపోవడం మూలంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట రుణం, పంట నష్టపరిహారం, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు మొత్తం సొంత రైతుకు మాత్రమే చిందే విధంగా చట్టాలు రూపొందించడం వల్ల కౌలు రైతులకు ఎలాంటి పథకాలు దక్కడం లేదు. ఎన్నికల అవసరాల నిమిత్తం అధికార మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ సమగ్రమైన పౌలు రైతు చట్టం తీసుకువస్తామని, కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని, అంటారు రుణాలు అందిస్తామని, ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్న తరువాత కౌలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు దఫాలుగా అన్నదాత సుఖీభవ నిధుల్ని రైతులకు వేసిన ఒక్క కౌలు రైతుకు కూడా ఒక నయా పైసా పెట్టుబడి సహాయం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. గత జగన్ ప్రభుత్వం కౌలు రైతులకు సమగ్రమైన చట్టం చేయలేదు మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తే అన్ని రకాలుగా కౌలు రైతులను ఆదుకుంటామని మాయ మాటలు చెప్పిన ప్రస్తుత కూటమిప్రభుత్వం కౌలు రైతులను నమ్మించి మోసం చేస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాలో దేవాలయ ,ధర్మాదాయ, వక్ఫ్ భూములు, రైతుల సొంత భూములు ముందస్తు కౌలు చెల్లించి సాగు చేసుకున్న రైతులకు కనీస పెట్టుబడులకు సరిపడ దిగుబడి రాక, తమకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని మరియు ఇండ్లు, తమ భార్య పిల్లలకు ఉన్న బంగారు ఆభరణాలను ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకు లలో మరియు ప్రైవేట్ ఫైనాన్స్ దారుల వద్ద అధిక వడ్డీలతో అప్పులు తీర్చి తీర్చలేక, అప్పుల భారంతో, అవమానంతో బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల భార్య పిల్లలు కుటుంబ సభ్యులు దిక్కులేని వారి గా ఉంటూ, ఆర్థికంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పౌలు రైతుల పట్ల కనికరం చూపాలని, వారికి సొంత రైతుల మాదిరి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని, పెట్టుబడి సహాయం వెంటనే ఓకే విడతలో కౌలురైతుల అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావున మండలంలోని కౌలు రైతులందరూ 23 24వ తేదీలలో జరిగే దీక్షలో రాజకీయాలకతీతంగా పాల్గొనాలని రైతులను కోరుతూ రుద్రవరం మండలంలోని గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు.