logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కూనవరం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రావెల్ రోడ్లు ప్రారంభం

కూనవరం : పోలవరం జిల్లా కూనవరం మండలం కూనవరం టేకులబోరు గ్రామంలో కూనవరం సర్పంచ్ మల్లంపల్లి హేమంత్ గాంధీ ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి భాస్కర్ ఆదేశానుసారం పంచాయతీ నిధుల ద్వారా కూనవరం, ఉదయ భాస్కర్ కాలనీ, టేకులబోరు నందు దాదాపు 30 రోడ్లు పైచిలుకుపురవీధుల్లో గ్రావెల్ రోడ్లు పోపించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఏ విధంగా మార్పు చెందాయి అనేది యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా చూస్తుంది. అదేవిధంగా కూనవరం పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడు లేని విధంగా జరిగాయి. ఏ పంచాయతీలో జరగని విధంగా కూనవరం పంచాయతీల అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నోముల రామారావు, జనసేన మండల ప్రెసిడెంట్ దాసరి నరేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్ బుడుగుల బద్రి, తెలుగుదేశం నాయకులు చెలికాని ఉమా, నాగరాజు, జనసైనికులు శ్రీరామ్, అశోక్ సంతోష్, వెంకన్న, కాంట్రాక్టర్ కుసుమరాజుల సురేష్, షూఫీ తదితరులు పాల్గొన్నారు

0
10 views

Comment