ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU సమక్షంలో అంగన్వాడీల పలు డిమాండ్లు పరిష్కరించాలని రిలే దీక్ష.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీల పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ CITU యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షు లు తాళ్ల శ్రీనివాసులు,అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్షులు రాజ్యలక్ష్మి, ఆళ్లగడ్డ పట్టణ నాయకులు తాళ్ల రమేష్ బాబు పాల్గొని గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదనీ, అంగన్వాడీలకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని,పని భారం తగ్గించి యాప్ లను అంగన్వాడీలపై రుద్ది ప్రభుత్వ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ చాలీచాలని జీతాలతో ఎంత కాలం కొనసాగించాలని ప్రభుత్వాలు వాగ్దానం ఇచ్చి మోసగించాయని, ముక్తకంఠంతో మాట్లాడడం జరిగింది. ఆళ్లగడ్డ సిడిపిఓ కార్యాలయం దగ్గర రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 23, 24, 25 ఈ మూడు రోజులు రిలే నిరాహార దీక్షలు జరుపబడుననీ, అలాగే 26,27 తేదీలలో కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరాహార దీక్షలు చలో విజయవాడ మార్చి 3 తేదీ కలదనీ,అయితే రిలాక్ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మొదటి రోజున అంగన్వాడీ
ఉయ్యాలవాడ నుంచి బేబీ రాజేశ్వరి రుద్రవరం నుంచి సువర్ణ మనోజ చాగలమర్రి నుంచి పద్మావతి నాగమణి దొర్నిపాడు నుంచి మాధవి ఉదయలక్ష్మి ఆళ్లగడ్డ నుంచి నరసమ్మ శైలజ సుధామని గాంధీ లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొనడం జరిగింది.