logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లయన్స్ క్లబ్బులు సేవలను గ్రామస్థాయికి విస్తృత పరచాలి –సామాజికవేత్త వరిగొండ కాంతారావు నవ్వుల జల్లు కురిపించిన జబర్దస్త్ ఫ్రేమ్ రాజమౌళి

తొర్రూరు,ఫిబ్రవరి24 (AIMEMEDIA):లయన్స్ క్లబ్ లు సామాజిక సేవకు వేదికలని, కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు విస్తృత పరచాలని సామాజికవేత్త వరిగొండ కాంతారావు అన్నారు.
లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్ పర్సన్ దామెర సరేశ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి డివిజన్ కేంద్రంలోని బృందావన్ ఎస్టేట్ లో వీరభద్ర రీజియన్ దామెర సేవా సమ్మేళనం పేరిట లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్ మీట్ ఘనంగా నిర్వహించారు.
రీజియన్ పరిధిలోని లయన్స్ క్లబ్ ప్రతినిధులు భాగస్వాములై రీజియన్ మీట్ ఆద్యంతం ఉత్సాహం నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత విభావరి, సంప్రదాయ నృత్యాలతో కార్యక్రమం క్లబ్ ప్రతినిధుల్లో ఉత్సాహం నింపింది.జబర్దస్త్ రాజమౌళి హాస్యవల్లరి కడుపుబ్బ నవ్వించింది.ఉత్తమంగా సేవలు చేస్తున్న క్లబ్బులు ప్రశంసనీ ఏమని అన్నారు . పలు క్లబ్ లకు అవార్డులు దక్కాయి.జిల్లా గవర్నర్ కౌడి చంద్రశేఖర్ ఆర్య, ఐపిడిజి కార్యదర్శి కుందూరు వెంకటరెడ్డి, మాజీ గవర్నర్లు తమ్మెర లక్ష్మీనరసింహారావు, డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి,
ఉప గవర్నర్లు నరహరి సుధాకర్ రెడ్డి, పుట్ట హరి కిషన్ రెడ్డి లతో కలిసి వరిగొండ కాంతారావు మాట్లాడారు.మన సమాజంలో ఆపదలో ఉన్న పొరుగువారికి సహకారం అందించాలనే సదాశయంతో ల‌య‌న్స్ క్లబ్‌ కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమ‌ని అన్నారు.ఎలాంటి లాభాపేక్ష లేకుండా రీజియన్ లోని 11 క్లబ్ లు వారి వారి ఆలోచనల మేరకు సమాజానికి పలు సామాజిక సేవలు అందించడం గొప్ప విషయమన్నారు.ఎంత సంపాదించినా అందులో కొంత సమాజానికి వినియోగిస్తేనే సంపాదించిన దానికి సార్థకత ఉంటుందన్నారు. సమాజంలో ఎందరో అభాగ్యులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని, వారికి చేతనైనంత సహాయం అందిస్తే కొంతైనా మేలు చేసిన వారవుతారని తెలిపారు.
పేద ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందన్నారు. ఈ మానవ జన్మలో ఐదు రకాల రుణాలు ఉంటాయని ఐదు రుణాలు తీర్చుకున్నప్పుడే జన్మకి సార్ధకతగా చేకూరుతుందని అందులో ఒకటి సేవారనం కూడా ఉంటుందని సంఘంలో జీవిస్తున్నప్పుడు సంఘానికి సేవలు చేసి ,అ రుణాని తీర్చుకోవాలని అన్నారు
రీజియన్ చైర్మన్ దామెర సరేష్ మాట్లాడుతూ సమాజానికి చేతనైన సాయం అందించడంలో లయన్స్ క్లబ్బులు ముందు ఉన్నాయని, లయన్స్ క్లబ్ వల్లే ప్రజలకు కొంత మేలు జరుగుతుందన్నారు. ఏడాది కాలంలో ఆశించిన దానికంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్బులు చేపట్టాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ సూర్నం రామ నరసయ్య, లయన్స్ ప్రముఖులు టి. వెంకట్ రెడ్డి,తమ్మెర విశ్వేశ్వర రావు, రేగూరి వెంకన్న,డాక్టర్ కిరణ్ కుమార్,అనుమాండ్ల దేవేందర్ రెడ్డి,చిదిరాల నవీన్ కుమార్, వజినపల్లి దీప, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు,ముడుపు రవీందర్ రెడ్డి, వి.శ్రీనివాస్,శంకర్ వివిధ క్లబ్ ల భాద్యులు పాల్గొన్నారు.

8
50 views

Comment