logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని కలిసిన ఆళ్లగడ్డ జనసేన నాయకులు ఇరిగెల

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు, ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.త్వరలో పార్టీ చేపట్టబోయే నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆళ్లగడ్డలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఇంటింటికీ జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు రాబోయే రోజుల్లో పార్టీలో దక్కబోయే సముచిత స్థానం మరియు పదవుల కేటాయింపుపై రామ్ తాళ్లూరితో చర్చించారు.
ఈ సందర్భంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రామ్ తాళ్లూరి సూచనల మేరకు త్వరలోనే కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

73
1608 views

Comment