కడారి నరేష్: జగిత్యాల జిల్లా: కథలాపూర్ తహసీల్దారుగా రమేష్ గారు బాధ్యతల స్వీకరణ:
కథలాపూర్ మండల తహసీల్దారుగా రమేష్ గారు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కథలాపూర్‌లో తహసీల్దారుగా విధులు నిర్వహించిన వెన్న వినోద్ గారు కోరుట్ల ఆర్డీవో కార్యాలయానికి బదిలీ అయినట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల ఆర్డీవో కార్యాలయం నుంచి రమేష్ గారు కథలాపూర్ తహసీల్దారుగా బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, అధికారులు రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.