బెంగాల్ లో రాష్ట్రపతి కి అవమానం
నిన్న అంటే 7వ తేదీ పశ్చిమ బెంగాల్‌లో 9వ అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ జరిగింది.
దానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఇది ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డార్జిలింగ్/ సిలిగురి ప్రాంతంలో జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రపతి గారికి ఘోర అవమానం జరిగింది.
సంతాల్ ప్రజలు భారతదేశంలో అతిపెద్ద ఆదివాసి (ట్రైబల్) సమూహాల్లో ఒకటి.
వీరు ప్రధానంగా ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం, బెంగాల్ దేశం, నేపాల్ వంటి ప్రాంతాల్లో ఉంటారు. వీరు ఒకటి/రెండు సం.లకు ఒక్కసారి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తారు. దానికి సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ ప్రజలు భారత్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ నుండి భారీగా హాజరు అవుతారు. నిన్న జరిగిన సదస్సు 9వ సదస్సు.
సదస్సు ముందుగా నిర్ణయించి ప్రెసిడెంట్ గారికి చెప్పిన ప్రాంగణంలో లో కాకుండా ఆదివాసీ ప్రజలు సభకు చేరుకోడానికి వీలు లేని దూర ప్రదేశానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
రాష్ట్రపతి గారిని ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవలసిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు గానీ రాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోలేదు. కేవలం ఒక మేయర్ ఆమెను రిసీవ్ చేసుకున్నారు.
దీనిపై రాష్ట్రపతి ముర్ము గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ...
చూడండి! "ఈరోజు అంతర్జాతీయ సంతల్ సమావేశం జరిగింది. నేను దీనికి హాజరైన తర్వాత ఈ స్థలానికి వచ్చినప్పుడు, ఇక్కడ నిర్వహించి ఉంటే బాగుండేదని నేను గ్రహించాను, ఎందుకంటే ఈ ప్రాంతం చాలా విశాలమైనది... పరిపాలనా యంత్రాంగం మనసులో ఏముందో నాకు తెలియదు... ఆ ప్రదేశం రద్దీగా ఉంది, వారు వద్దు అనుకున్నారు, కానీ ఐదు లక్షల మంది ఇక్కడ సులభంగా గుమిగూడగలరని నేను అనుకుంటున్నాను. కానీ వారు మమ్మల్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు... సంతల్ ప్రజలు వెళ్లలేని స్థలాన్ని వారు ఈ సమావేశానికి ఎంచుకున్నారు. పరిపాలనా యంత్రాంగం మనసులో ఏముందో నాకు తెలియదు... ఈ సమావేశాన్ని చాలా దూరంగా నిర్వహించడం వల్ల ఇక్కడ ప్రజలు అక్కడికి చేరుకోలేకపోయారని నాకు చాలా బాధగా ఉంది. బహుశా ఎవరూ హాజరు కాలేరని, మరియు రాష్ట్రపతి వెనక్కి తిరిగి వెళ్లిపోతారని పరిపాలన ఆశించి ఉండవచ్చు, ..
రాష్ట్రపతి ఒక ప్రదేశాన్ని సందర్శిస్తే, ముఖ్యమంత్రి మరియు మంత్రులు కూడా రావాలి. కానీ ఆమె రాలేదు... నేను కూడా బెంగాల్ కుమార్తెను... మమతా దీదీ కూడా నా సోదరి, నా చెల్లెలు. ఆమె నాపై కోపంగా ఉందో లేదో నాకు తెలియదు, బహుశా అందుకేనేమో ఇది... జరిగింది.
అంటూ చాలా వేదనగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
దీనిపై మమత స్పందిస్తూ ఇవన్నీ బిజేపి రాజకీయాలు. సం. కి ఒక సారి వస్తే కలవగలను. కానీ, ఎన్నికల సమయంలో వస్తే ఆమెను కలవడానికి నాకు టైం ఉండదు అని పొగరుగా స్పందించారు.
కానీ, మమత పూర్తి తెలివి తక్కువ గా ప్రవర్తించారు. ఎందుకంటే, ఎన్నికల లెక్కల్లో చూసుకున్నా జరుగుతున్నది ఆదివాసీల సభ, అందులో బెంగాల్ ఆదివాసీలు కూడా దానికి హాజరు అయ్యారు. ముఖ్య అతిధిగా స్వయంగా ఆదివాసీ అయిన దేశ రాష్ట్రపతి గారు హాజరు అయిన ఈ సభకు మమత వచ్చి ఉంటే ఆదివాసీలను గౌరవించినట్లు ఉండేది మమతకు ఎంతో కొంత మంచి పేరు వచ్చి ఉండేది.
కానీ, మమత కు రాజకీయాలు అహం అడ్డు వచ్చి రాష్ట్రపతి ని అవమానించారు.
ఇది సెక్యులర్ బెంగాల్ లో జరిగింది కాబట్టి ఉదార మేధావులు నోరు మెదపలేదు. అదే బీజేపీ రాష్ట్రంలో జరిగి ఉంటే ఆదివాసీ లను ఆదివాసీ రాష్ట్రపతిని అవమానించిన బిజెపి అంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసి ఉండేవారు.