ప్రకృతి వనంలో పారిశుద్ధ్య పనులపై జేసీ ఆకస్మిక తనిఖీ.
కాటారం: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమాన్ని పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్లా లోకల్ బాడీ జాయింట్ కలెక్టర్ విజయలక్ష్మి సోమవారం కాటారం మండలంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వనంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆమె, చెత్తాచెదారాన్ని తొలగించడం, ఎండిన మొక్కలను నరికివేసి ప్రాంగణాన్ని శుభ్రం చేయడం వంటి పనులపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రకృతి వనంలో నీటి సౌకర్యం లేకపోవడం గమనించిన జేసీ విజయలక్ష్మి, మొక్కలకు నీరు ఎలా పోస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మొక్కలు ఎండిపోకుండా వాటికి తగిన విధంగా నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.