logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భార్యాభర్తలను కలిపిన న్యామూర్తి..

శ్రీకాకుళం:

జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో శనివారం అధికంగా 11,602 కేసుల్లో పదివేలకుపైగా పరిష్కరించారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌, జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఆధ్వర్యంలో పలు సివిల్‌, క్రిమినల్‌ కేసులు, మోటార్‌ ప్రమాదాల నష్టపరిహారం కేసులు పరిష్కరించారని జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు చెప్పారు. జిల్లా మొత్తం మీద అన్ని కోర్టుల్లో కలిసి 20 బెంచ్‌ లు ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. సివిల్‌, క్రిమినల్‌ కాంపౌండబుల్‌ కేసులతో పాటు ప్రభుత్వ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. గత డిసెంబ ర్‌ నెలలో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 6,454 కేసులు పరిష్కారం అయ్యాయ ని చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మోటార్‌ యాక్సిడెంట్‌ ఇన్స్యూరెన్స్‌ కేసును రాజీ చేసి కక్షిదారులకు 37 లక్షల 50 వేల రూపాయల చెక్కును జడ్జి చేతుల మీదుగా అందజేశారు.

భార్యాభర్తలను కలిపారు

రాజీ మార్గం ద్వారా భార్యాభర్తలు కలిసి జీవించేందుకు అదాలత్‌లో ఒప్పించారు. వాస్తవ పరిస్థితులు వివరించి, వారి మధ్య విభేదాలు లేకుండా చేసి, ఒక జంటను ఏడేళ్ల తర్వాత కలిపారు. ఈ కేసులు న్యాయవాది కె.సుభాష్‌ రాజీ ద్వారా ఒప్పించి కేసును పరిష్కరించారు.

12
247 views

Comment