logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వైష్ణవి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

జగిత్యాల ప్రతినిధి (గట్టిపెల్లి రాజశేఖర్ ) మార్చి 19 :

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (వయస్సు 20 సంవత్సరాలు) హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా, నిందితుడు హరిబాబుకు సహకరించి, బాధితురాలిని కట్నం కోసం మానసికంగా మరియు శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న) వారి పై కట్న వేధింపులు మరియు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి, మెట్పల్లి డిఎస్పి శ్రీ ఏ. రాములు ఆదేశాల మేరకు, ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టి, ఈ కేసులో నిందితులు అయిన చిత్తారి లక్ష్మి , చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్ లను గురువారం అరెస్ట్ చేసి డిఎస్పి ముందు హాజరుపరచగా, డిఎస్పి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించిన్నట్లు డిఎస్పీ రాములు తెలిపారు.

10
278 views

Comment