logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేసిన మహిళలు కళ్యాణ్ ఏర్పాట్లను పరిశీలించిన ఛాంబర్ సభ్యులు

తొర్రూరు మార్చి 26(AIMEMEDIA) డివిజన్ కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవ్వగా గురువారం రోజున ఉదయం పూజా కార్యక్రమాలు అనంతరం ముత్తైదువులచే శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి తలంబ్రాల బియ్యం కలిపారు అనంతరం విశ్వక్సేన పూజ కలశ స్థాపన తో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యా యన్నారు.. సాయంత్రం తొర్రూరు సౌందర్యలహరి సమూహము వారిచే సౌందర్యలహరి పారాయణం అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం.నిర్వహించారు. గురువారం ఉదయం స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు కలుపుట మధ్యాహ్న సాయంత్రం పూజ నాతోపాటు వికాసతరంగిణి తొర్రూరు వారిచే విష్ణు సహస్రనామం పారాయణం అనంతరం సుందర సత్సంగ్ వారిచే భజన, భగవద్గీత పారాయణం నిర్వహిస్తున్నామని శుక్రవారం ఉదయం 6 గంటలకు రజకుల పూజ 9 గంటలకు రామ మందిరం నుండి మంగళ వాయిద్యాలతో ఉత్సాభివృద్ధి సమేతంగా బయలుదేరి 10 గంటలకు శివాలయం వద్ద కార్యక్రమం అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నా మని అన్నారు. కల్యాణం అనంతరం క్యూ లైన్ లో స్వామివారి అక్షితలు ,తీర్థప్రసాద వితరణ సాయంత్రం హోమము పూర్ణాహుతి అనంతరం శ్రీ సీతారామచంద్రమూర్తి పరిపాల సమేతంగా పట్టణ వీధుల్లో శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్ని వ్యాపార వర్గాల సోదరులు సభ్యులు భక్తులు అధికంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తూ శ్రీ సీతారామచంద్ర కృపకు పాత్రులు కావాలని కోరారు. . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మచ్చ సురేష్ ఉపాధ్యక్షులు చలపతి సత్యనారాయణ ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ చక్రపాణి, మచ్చ లక్ష్మయ్య ఇమ్మడి రాంబాబు రేగురి శ్రీనివాస్ శ్రీధర్ ప్రకాష్, సభ్యులు సౌందర్య లహరి పారాయణం సభ్యులు సుందర సత్సంగ్ బాధ్యులు పాల్గొన్నారు కళ్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు

24
741 views

Comment