logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నరహరిపేట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

నమస్తే సిహెచ్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని నరహరిపేట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, ఫైర్ ఆఫీసర్ కరుణాకర్, నరహరిపేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలపై సూచనలు చేశారు. ముఖ్యంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, సరైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని హెచ్చరించారు.

అదేవిధంగా బస్సుల్లో ఫైర్ సేఫ్టీ కిట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి భద్రతా పరికరాలను పరిశీలించారు. ప్రయాణికులకు కూడా ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు.

అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని తెలిపారు.

ప్రజలకు సూచనలు:

10
17 views

Comment