logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మరో అరుదైన గౌరవం

అంతర్జాతీయ ఢిల్లీ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్డి) 2026లో భాగంగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం దక్కింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేసిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని ఈ చలనచిత్రోత్సవ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,'మా అమ్మనాన్నల ఆశీర్వాదం వల్లే నేను చిత్ర సీమలో యాభై ఏళ్లుగా రాణిస్తూనే ఉన్నాను. ఇతర ఏ భాషలోనూ, ఏ ఇండస్ట్రీలోనూ ఇలా యాభై ఏళ్ల పాటు హీరోగా రాణిస్తున్న వ్యక్తి లేరని నేను గర్వంగా చెప్పగలను.

మహిళల గురించి, మహిళల సాధికారత గురించి మా నాన్న ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. తండ్రి ఆస్తిలో మహిళలకు వాటాని కల్పించే చట్టాన్ని ఆయనే మొదటగా తీసుకు వచ్చారు. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటినీ స్థాపించారు. మా నాన్న సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా మహిళా సాధికారత గురించి పాటు పడ్డారు. ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశయాల్ని మేం కొనసాగిస్తాం. మా 'భగవంత్ కేసరి' సినిమాని ప్రదర్శించడం గర్వంగా ఉంది' అని అన్నారు. 'మా బాలకృష్ణకి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం గర్వంగా ఉంది. అలాగే మా సినిమాని ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పిన సందేశం అందరికీ చేరువైంది' అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.



4
103 views

Comment