logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యూసుఫ్ నగర్‌లో సేవా కార్యక్రమం – స్టీల్ ప్లేట్ల పంపిణీతో ఆరోగ్య చైతన్యం

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 04/04/2026:
యూసుఫ్ నగర్ గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన డెల్టా కేర్ డయాగ్నొస్టిక్స్ డైరెక్టర్ బసవేని మహేష్, ముక్కెర స్వామి అన్నప్రసాద అవసరాల కోసం స్టీల్ ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారి సేవలను అభినందిస్తూ, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా, గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, అందరూ ప్లాస్టిక్‌ను నిషేధించి స్టీల్ పాత్రలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని గ్రామ పెద్దలు తెలిపారు.

7
38 views

Comment