logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాతీయ రత్న అవార్డు అందుకున్న పి.వి.ఎం నాగజ్యోతి

శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని జిల్లా పౌర గ్రంథాలయం ఏసి ఆడిటోరియంలో నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించిన నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు జాతీయ రత్న అవార్డుల ఉత్సవంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు మరియు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారికి “జాతీయ రత్న ఉగాది పురస్కారం” ప్రదానం చేయబడింది.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. విద్యా రంగంలో విశేష సేవలందించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ కనబరిచినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పైడా కృష్ణ ప్రసాద్ గారు, సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు శ్రీ ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు శ్రీ దుగ్గివలస దివాకర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ దాడి సత్యనారాయణ గారు, సినీ నిర్మాత శ్రీ బాలాజీ నాగలింగం గారు తదితర ప్రముఖులు హాజరై విజేతను అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని పి.ఏ. భాస్కరరావు గారు (సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు కళాభూషణ్ అవార్డు గ్రహీత) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, విద్యా రంగంలో మరియు క్రీడా రంగంలో శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారి సేవలు యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు.

11
390 views

Comment