తిరుమల పవిత్రత కాపాడాలి – టిటిడి చైర్మన్‌ను తక్షణమే తొలగించాలి కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్
తిరుమల పవిత్రత కాపాడాలి – టిటిడి చైర్మన్‌ను తక్షణమే తొలగించాలి కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్
తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్
కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కోవూరు మండలంలో పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో పోతిరెడ్డి పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడాలని, టి.టి.డి బోర్డు చైర్మన్‌గా ఉన్న బి.ఆర్. నాయుడు ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, APLDA చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ తో పాటు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.