ఊటుకూరులో బెజవాడ వంశీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు
విడవలూరు మండలం ఊటుకూరులో టిడిపి నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి బిల్లు ఆమోదం లభించడంతో సంబరాలుగా చేయడం జరిగింది
ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూమా రాజధాని అమరావతి అంటూ చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.