logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పాత వెంకటాపురం గ్రామంలో దేవస్థానం స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో దేవస్థానం స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
గ్రామంలోని సత్యమ్మ గ్రామదేవత ఆలయం స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన కొందరికి తహసీల్దార్ కార్యాలయం ద్వారా అనతికాలమ్ లో ఆగమేఘాలమీద అక్రమమార్గంలో పట్టాలు ఇచ్చారని స్థానిక హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోతపోల రామమూర్తి మరియు ఆంధ్రప్రదేశ్ హిందూ చైతన్య వేదిక ప్రచారక్ పుంగనూరు నానబాల లోకేష్ రాయల్ లు మాట్లాడుతూ…
సుమారు 50 సంవత్సరాలుగా BC (వడ్డెర/బోయ) కులానికి చెందిన 50 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తూ సత్యమ్మ గ్రామదేవతను పూజిస్తున్నారని తెలిపారు. కొండలు, గుట్టలు, బండరాళ్లుగా ఉన్న సర్వే నంబర్ 9/1 లో 2.39 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు (పంచాంగం) భూమిగా ఇప్పటికీ రెవెన్యూ ఫెయిర్ అడంగల్ లో ఉన్నదన్నారు. ఈ భూమిని ఎంతో శ్రమించి చదును చేసిన ఘనత బీసీలదేనన్నారు.
పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను ఇప్పటికే అర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన అగ్రవర్ణాలకు చెందిన, బాగా స్థిరపడిన వారికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం?, ఎంత వరకు న్యాయం అని వారు ప్రశ్నించారు.
వడ్డెర కుటుంబాలకు దేవస్థానం నిర్మాణం కోసం అదే స్థలాన్ని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గంగాధర నెల్లూరు తహసీల్దార్ పై ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వెంటనే జోక్యం చేసుకుని గ్రామంలోని పేద కుటుంబాలకు న్యాయం చేయాలని, దేవస్థానం నిర్మాణానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారుల స్పందన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ఇదే అంశంపై మరిన్ని వివరాలు త్వరలో…
🚨 BREAKING NEWS స్క్రోల్ లైన్స్
🔴 చిత్తూరు జిల్లాలో దేవస్థానం స్థల వివాదం
🔴 పాత వెంకటాపురంలో సత్యమ్మ దేవస్థానం భూమి వివాదం
🔴 అక్రమంగా పట్టాలు ఇచ్చారని హిందూ సంఘాల ఆరోపణ
🔴 50 ఏళ్లుగా పూజలు చేస్తున్న వడ్డెర కుటుంబాలు
🔴 తహసీల్దార్ వెంటనే స్పందించాలని హిందూ చైతన్య వేదిక డిమాండ్
🔴 స్పందించకపోతే ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరిక
🔴 జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

13
374 views

Comment