logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సమాజ సేవలో కొత్త మైలురాయి – శారదామృత సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం

పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రధాన కేండ్రంగ శారదామృత సేవా ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మారుటేరు సెంటర్‌తో పాటు, పరిసర గ్రామాల్లో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా అన్నదానం, గో సేవ, యాచకులకు వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. ట్రస్ట్ ప్రారంభం నుంచి వేలాది మందికి అన్నదానం చేయడంతో పాటు గోవులకు కూరగాయలు అందజేయడం జరిగింది. వానరాలకు ఆహారంగా అరటి పండ్లు పంపిణీ చేయడంతో పాటు పేదలకు రగ్గులు, మహిళలకు చీరలు అందించారు.
అదేవిధంగా అవసరమైన వారికి వైద్య సహాయం కూడా అందిస్తూ, కులమతాలకు అతీతంగా సేవలను కొనసాగిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ డా. వి సత్యహరి మాట్లాడుతూ, మానవత్వమే అసలు మతమని, అందుబాటులో ఉన్న వనరులతో సమాజ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సేవా కార్యక్రమాలకు తోడ్పడిన దాతలు, స్నేహితులు, బంధువులు, పాత్రికేయ మిత్రులందరికీ ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

0
2 views

Comment