ఎమ్మెల్యే శ్రీగణేష్ కు డబుల్ బెడ్రూం అందుకున్న లబ్దిదారుల కృతజ్ఞతలు.!
సికింద్రాబాద్: మారేడుపల్లి డబుల్ బెడ్రూం పట్టాలు అందుకున్న లబ్దిదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు,తెలియజేశారు.
మారేడ్ పల్లి ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణానికి తమ స్వంత ఇళ్ళను ఇచ్చి ఎన్నో ఏళ్ళుగా కిరాయి ఇళ్ళలో ఉంటూ అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అ కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి తాను అధికారులతో నిత్యం మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి , రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు, ఇంఛార్జ్ మంత్రి వర్యుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లి రెండు రోజుల క్రితం వారికి పట్టాలను అందించగలిగామని అన్నారు.ఈ ఇళ్ళు మీ ఆస్తి అని, మీ కన్నీళ్ళను చూసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించిందని ,మీ కళ్ళల్లో ఆనందమే తన ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారితో చెప్పారు.