logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ చైతన్య పాఠశాలలో అంబేద్కర్ జయంతి ప్రిన్సిపల్ రమ్య ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు



పాల్వంచ ఏప్రిల్ 14 పట్టణంలో గల కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను పాఠశాల ప్రిన్సిపల్ రమ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటాన్ని పూలమాలతో సత్కరించి ఘన నివాళి అర్పించారు. శ్రీ చైతన్య పాఠశాలలో అంబేద్కర్ జయంతి అంతేకాకుండా పాఠశాల ప్రిన్సిపల్ అయినా రమ్య మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని వారి ఆశయాలను గుర్తు చేసుకున్నారు.అంబేద్కర్ ఒక మామూలు మనిషి మాత్రమే కాదని ఆయన ఒక ప్రజాశక్తి అని కొనియాడారు. నేటితరం ఆయన ఆశయాలకు తగ్గట్టుగా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ పాఠశాల ఏజీఎం జయప్రకాష్ , పాఠశాల ప్రిన్సిపల్ రమ్య డీన్ మధు సి ఇన్చార్జ్ నాగబాబు ప్రైమరీ ఇంచార్జ్ రేణుక ప్రీ ప్రైమరీ ఇన్చార్జి అనూష ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

11
523 views

Comment