బుగ్గారంలో గంజాయి పట్టివేత
- పోలీసుల అదుపులో ఇద్దరు - 70 గ్రాముల గంజాయి స్వాధీనం
- కేసు నమోదు చేసిన ఎస్సై జి.సతీష్
-గంజాయి సమాచారం ఇవ్వాలని పిలుపు
బుగ్గారంలో గంజాయి పట్టివేత
పోలీసుల అదుపులో ఇద్దరు - 70 గ్రాముల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసిన ఎస్సై జి.సతీష్
గంజాయి సమాచారం ఇవ్వాలని పోలీసుల పిలుపు
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామంలోని పల్లె ప్రక్రుతివనంలో ఇద్దరు గంజాయి ప్రియులను మంగళ వారం అదుపులోకి తీసుకున్నట్లు బుగ్గారం ఎస్సై జి .సతీష్ తెలిపారు. వారి నుండి 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఎ 1 గా గొల్లపల్లి మండలం శ్రీ రాములపల్లి కి చెందిన
గజ్జెల తిరుమల్ తండ్రి: భూమయ్య , వయస్సు : 17 సంవత్సరాలు, ఎ 2 గా బుగ్గారం కు చెందిన నక్క నవీన్ తండ్రి: లక్ష్మణ్ , వయస్సు 23 సంవత్సరాలు గా గుర్తించడం జరిగిందన్నారు. ఈ ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడడం జరిగిందన్నారు. ఎన్.డి. పి.ఎస్. చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని వివరించారు. బుగ్గారం మండలంలో గంజాయి తాగిన, అమ్మిన, కలిగి ఉన్న చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి గురించి సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఎస్సై జి.సతీష్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.