ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడండి..
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఈనెల 20, 21 తేదీలలో జరుగుతున్న పెద్దమ్మ దేవర సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం లేకుండా చూడాలని మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి ఏడి,డాక్టర్ మనోరంజన్ ప్రతాప్, ఇన్చార్జి ఈవో వడ్డె రామకృష్ణ మంగళవారం నాడు పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక 1వ సచివాలయంలో వారు మాట్లాడుతూ పెద్దమ్మ దేవర సందర్భంగా గ్రామంలోని అన్ని కాలనీలలో వీధిలైట్లు, పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి కొళాయిలు మరమ్మతులు, పైపులైన్ల ఏర్పాటు, తదితరు అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. జాతర సందర్భంగా వచ్చే ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు చేయాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.