logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గూడూరును నియోజకవర్గం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం

గంగారం కొత్తగూడా కేసముద్రం గూడూరు మండలాలను*కలిపి పాత తాలూకా అయిన గూడూరు కేంద్రంగా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని గూడూరు నియోజకవర్గ సాధన సమితి యువజన జేఏసీ నాయకులు సోమవారం రోజు జిల్లా కలెక్టర్ . స్నేహ శబరిష్ గారికివినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన జేఏసీ గౌరవ సలహాదారులు. వాంకుడోత్ కటార్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.... గూడూరు నియోజకవర్గం ఏర్పాటు కావడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని పాత తాలూకా అయిన గూడూరు నియోజకవర్గంగా కొత్తగూడ గంగారం కేసముద్రం మండలాలను కలుపుకొని గూడూరు ను నియోజకవర్గంగా చేయాలని వారు జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గూడూరు ను నియోజకవర్గం చేసే దిశగా దశలవారీగా యువజన జేఏసీ పక్షాన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన జేఏసీ నాయకులు. ఎండి రహీం పాషా భూక్యా సురేష్ నాయక్ బానోత్ సునీల్ నాయక్ గోలి డానియల్. కుమార్.అశోక్. అరవింద్ .మధు నాయక్ .తదితరులు పాల్గొన్నారు

8
1099 views

Comment