పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు సింగర్ మంగ్లీ.
ప్రముఖ గాయని మంగ్లీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి ఆమె ఇచ్చిన ఫిర్యాదులో, సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి డబ్బు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు దుర్భాషలాడుతూ, మీడియాలో దుష్ప్రచారం చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగ్లీ కోరారు.