logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మర్రి నరేష్ ప్రధాన వార్త : జగిత్యాల పోరు గులాబీ సభకు హస్తం 'చెక్'.. రాజకీయ చదరంగంలో పైచేయి ఎవరిది...?

మర్రి నరేష్ ప్రధాన వార్త : జగిత్యాల పోరు గులాబీ సభకు హస్తం 'చెక్'.. రాజకీయ చదరంగంలో పైచేయి ఎవరిది?

​తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు అందరి కళ్లు జగిత్యాల వైపే. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభ కావడంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అయితే, ఈ సభ ప్రభావం ప్రజల్లోకి వెళ్లకుండా అధికార కాంగ్రెస్ పార్టీ 'డైవర్షన్ పాలిటిక్స్' కు తెరలేపిందనే విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
​వ్యూహాల వెనుక 'మేడిగడ్డ' స్కెచ్..?
​కేసీఆర్ బహిరంగ సభ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను ప్రకటించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. మీడియా కవరేజీని చీల్చడం ద్వారా కేసీఆర్ మాటలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ సలహాతోనే ఈ ప్లాన్ అమలైందనే ఆరోపణలు కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.

​ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో దిగ్గజంగా పేరున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం, ఆ పార్టీ పునాదులను కదిలించినట్లయ్యింది.
​ జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ ఒక్కసారిగా పుంజుకుంది.
​ సీనియర్ నేతను కోల్పోయిన ఆవేదనలో ఉన్న కాంగ్రెస్, ఆయనను 'అవుట్ డేటెడ్' అని విమర్శిస్తూ తన బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
​"ఇది రాహుల్ గాంధీ మార్కు కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి మార్కు కాంగ్రెస్" అంటూ వెలువడుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్లాయి. సొంత పార్టీ సీనియర్లను గౌరవించుకోలేకపోవడం, క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి మింగుడుపడని విషయాలుగా మారాయి.
​తనపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక, రేవంత్ రెడ్డి కింది స్థాయి నేతలను ఎమ్మెల్యేలను సీనియర్లపైకి ఉసిగొల్పుతున్నారనే వార్తలు పార్టీలోని అంతర్గత సంక్షోభాన్ని బయటపెడుతున్నాయి. జగిత్యాల సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ఏ మేరకు ఫలిస్తాయో రాబోయే రోజుల్లో వేచి చూడాలి.

75
611 views

Comment