డిహెచ్బిఎస్ జిల్లానూతన ఎన్నికలు
DHPS 4వ జిల్లా మహాసభల్లో నూతన కమిటీ ఎన్నిక ,
జిల్లా గౌరవ అధ్యక్షులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర గారు ఎన్నిక,
జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా నాగదాసరి ఇమ్మానియేల్, కానగల మునెయ్య లు ఎన్నిక,
దళిత హక్కుల పోరాట సమితి (DHPS) నాలుగవ జిల్లా మహాసభలు 19, 20,వ తేదీల్లో బద్వేల్లో ఘనంగా ముగిశాయి,
నేడు కడప నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికైన నూతన కమిటీ వివరాలను నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీడియాకు తెలియజేయడం జరిగింది, కమిటీని వారు ప్రకటిస్తూ జిల్లానూతన కార్యవర్గం ఎన్నికైంది. ఇందులో *కడప జిల్లా డి హెచ్ పి ఎస్ గౌరవ అధ్యక్షులుగా కామ్రేడ్ గాలి చంద్ర, అధ్యక్షులుగా నాగ దాసరి ఇమ్మానియేల్, ప్రధాన కార్యదర్శిగా కానగల మునెయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పడిగే వెంకటరమణ, కోశాధికారిగా కృప, ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ వివరాలు:
జిల్లా ఉపాధ్యక్షులు: గూడూరు పెంచలయ్య, మిడుతూరు ప్రసాద్, తిరుమల, ఇరుపోతుల శ్రీనివాసులు వర్మ, నాగేశ్వరరావు, సుబ్బరాయుడు, రాయప్ప, అలాగే జిల్లా
సహాయ కార్యదర్శులుగా: గున్నా గోవింద్, మల్లి పోగు ప్రసాద్, పాలెంపల్లి చంద్రగుప్త, కామ్రేడ్ నాగేష్ గడ్డం వెంకటరమణ,చెన్నయ్య, బి కోడూరు ప్రసాద్, గడ్డం వెంకటరమణ, మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్లుగా 35 మంది ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగదాసరి ఇమ్మానియేల్ కానగల మునెయలు మాట్లాడుతూ ఈ ఎన్నికకు సహకరించిన జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్రన్న గారికి మరియు జిల్లా కార్యవర్గానికి ,జిల్లా కౌన్సిల్ సభ్యులు అందరికీ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, అన్నారు మా మీద నమ్మకం ఉంచి తిరిగి ఏకగ్రీవంగాబిఎన్నిక చేసినందుకు జిల్లా పిల్లా పార్టీకి ధన్యవాదాలు అన్నారు జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితిని బలోపేతం చేసి గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిన వారికి మద్దతుగా డిహెచ్పిఎస్ అండగా ఉండి పోరాడుతుందని వారు తెలిపారు, జిల్లాలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత వాడల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేసి దళిత కాలనీలో అభివృద్ధి చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతధంగా అమలు చేసి కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు వెంటనే ఉపాధి లోన్లను ఇవ్వాలని, జిల్లాలోని దళిత కుటుంబాలకు పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని అలాగే భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలని, దళిత సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని, దళితుల పైన దాడులు అరికట్టాలని ఎస్సీ ఎస్టీ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని తీర్మానాలతో జిల్లా మహాసభల్లో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు, నా మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా ఆఫీస్ బేరర్స్ పాలంపల్లి చంద్రగుప్త గడ్డం వెంకటరమణ గున్న గోవింద్ సికే వెంకటయ్య మధు తదితరులు పాల్గొన్నారు,