ఏప్రిల్ 22న మాదకద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సు
ఏప్రిల్ 22న స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణ యువత పాత్రపై అవగాహన సదస్సు జరగనుందని,ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్ధులతో పాటు స్థానిక యువత పాల్గొని జయప్రదః చేయాలని వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పప్పల పవన్ కళ్యాణ్ విజ్ణప్తి చేసారు.ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద పత్రికా విలేఖర్లతో మాట్లాడారు.ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఏపి అద్యక్షుడు మమ్ముల తీరుపతిరావు మాట్లాడుతూ దేశాభివ్రుద్ధికి యువశక్తి అవుసరమని అటువంటి యువశక్తి మాదకద్రవ్యాల బారిన పడి నిర్వీర్యం అవుతుందని యువశక్తిని కాపాడుకోవాలసిన సామాజిక భాద్యత అందరి పైప ఉందని యువత చైతన్యమవ్వాలని అన్నారు.మాదక ద్రవ్యాల నిరోధానికి,అక్రమ రవాణాను అరికట్టడానకి యువతను చైతన్యపరుస్తూవైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజషన్ వ్యవస్థాపకుడు విజయ్ కలాం ఈ నెల 6న తిరుపతి యస్ వి యూనివర్సిటీ నుండి సైకిల్ యాత్ర ప్రాంభించారని, అది 25 యూనివర్సిటీల గుండా ప్రయాణిస్తూ లక్షలాదిమంది యువతను చైతన్యపరుస్తూ ఈనెల 22 న ఆంధ్రా విశ్వ విద్యాలయాలలో ముగింపు అవుతుందని తెలిపారు.అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా 100నియోజకవర్గాల్లో సధస్సులు,100మీటర్ల జాతీయ జెండా ప్రధర్షన, ప్రతిజ్ణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ నాగిరెడ్డి జగన్మోహిని పాల్గొన్నారు.