logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై నిర్లక్ష్యం విడనాడాలి. లేకుంటే సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధం....



Aima Media News:
మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ వెల్లడి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ లో 2026 మార్చి నెల జీతాన్ని నేటికి చెల్లించలేదని,
బడ్జెట్ లేవనే కారణంతో రాష్ట్రంలో 25 నుండి 30 మున్సిపాలిటీలలో జీతాలు బకాయిలు రెండు నెలల నుండి నాలుగు నెలలు ఉన్నాయని, అధికారులు గత వారం రోజులుగా చెల్లిస్తామని చెప్పి నేటికీ మార్చి నెలకు మాత్రమే డిఎంఏ కార్యాలయం ఆదేశాలు ఇవ్వడం మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని యూనియన్ విమర్శించింది.
రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం నిరసిస్తూ ఈరోజు పని బందు చేస్తూ నిరసన కార్యక్రమాలకి యూనియన్ పిలుపునిచ్చింది.
మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జరిగిన కార్యక్రమాన్ని నిర్దేశించి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, సాలూరు కమిటీ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి శంకర్, రవి ,రాముడు మాట్లాడారు.
లక్షలాదిమంది పట్టణ ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులను పస్తులతో ఉంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
పురపాలక సంఘాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే జిల్లా మంత్రులు రాష్ట్ర పాలకు శాఖామంత్రులు ఏమి పట్టనట్టు ఉన్నారని వారి పాలనకు ఇది నిదర్శనం అవుతుందని తెలిపారు.
బకాయి జీతాలన్నీ చెల్లించేలా సైట్ ఓపెన్ చేయాలని,
చనిపోయిన రిటైర్ అయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం, ఇవ్వడం వెంటనే చేయాలని,
వారి వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
60 సంవత్సరాల రిటైర్మెంట్ నుండి 62 వేలకు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
గత 17 రోజుల సమ్మె సందర్భంగా చేసుకున్న అన్ని ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే స్థానిక సమస్యలతో అవసరాలనుకుంటే నిరవధిక సమ్మెకు వెళతామని తెలిపారు.
కార్యక్రమంలో కమిటీ నాయకులు మధుమోహన్, వెంకన్న ,పో లరాజు మహిళాకో కన్వీనర్ స్వప్న, మీడియా ఇంచార్జ్ శ్రీను, పర్మినెంట్ కార్మికుల సంఘం నాయకులు వెంకటరావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

0
58 views

Comment