logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎమ్మిగనూరు ట్రాఫిక్ నిబంధనల సమీక్ష సమావేశం యం. ఎల్. ఏ. బి. వీ.జయనాగేశ్వర రెడ్డి

మున్సిపల్ కార్యాలయంలో పోలీస్, ఆర్ & బి మరియు మున్సిపల్ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీజయనాగేశ్వర్ రెడ్డి గారుఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పోలీస్ శాఖ, ఆర్ & బి శాఖ, మున్సిపల్ కమిషనర్ మరియు టీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ మరియు నిబంధనల అమలుపై సమీక్షిస్తూ, పట్టణంలోని ప్రధాన కూడళ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణను బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ఓం శాంతి సర్కిల్, వ్యవసాయ మార్కెట్ యార్డు, పద్మశ్రీ మచాని సోమప్ప సర్కిల్, శివ సర్కిల్ మరియు కర్నూలు బైపాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేయాలనీఆదేశించారు.సాధ్యమైన చోట్ల వన్‌వే ట్రాఫిక్ అమలు చేయడం, కొత్త కాలువలు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం మరియు పారిశుధ్య సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. హైవేల్లో ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ భద్రతా సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసి వాటిని సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. అలాగే ముగతి నుండి నాగలదిన్నె వరకు బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఎమ్మిగనూరు పట్టణ, గ్రామీణ మరియు గోనేగండ్ల సీఐలు, ఎస్ఐలు, హైవే అథారిటీ డీఈ, ఆర్ & బి డీఈ, ఈఈ, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.*_

8
683 views

Comment